Break Darshan: ఎన్నికల ప్రకటన వెలువడడంతో దేశమంతా రాజకీయ సందడి ఏర్పడింది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో దేశంలో పలు సేవల్లో మార్పులు జరిగాయి. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో కూడా కీలక మార్పు జరిగింది. దర్శనానికి సంబంధించిన విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పు చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Medaram Hundi: మేడారం జాతరకు కానుకల వెల్లువ.. కాసుల వర్షం.. గతం కంటే అత్యధికంగా ఆదాయం


ఎన్నికల కోడ్  అమలు నేపథ్యంలో గ‌తంలో మాదిరి తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖ‌లు స్వీక‌రించరు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. సిఫారసు లేఖలను (రికమెండేషన్‌ లెటర్స్‌) రద్దు చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. స్వయంగా వ‌చ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం, వసతి కల్పిస్తామని స్పష్టం చేసింది. లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేప‌థ్యంలో టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యం మేర‌కు శనివారం నుంచి తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనానికి  సిఫారసు లేఖలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Also Read: Tirumala: వేసవికి కుటుంబంతో తిరుమల వెళ్తున్నారా..? వచ్చే నాలుగు నెలలు ఇవే ప్రత్యేక సేవలు


స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు, వారి కుటుంబ స‌భ్యుల‌కు నిర్దేశించిన విధివిధానాల మేర‌కు ద‌ర్శ‌నం, వ‌స‌తి క‌ల్పిస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్త‌య్యేవ‌ర‌కు ఏ రకమైన వ‌స‌తి, దర్శనాలకు కూడా సిఫారసు లేఖలు స్వీకరించబడవు. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలు తీసుకుని వచ్చే భక్తులకు దర్శనం, వసతి సౌకర్యం లభించదు. సిఫారసు లేఖలు పట్టుకుని వస్తే నిరాశే ఎదురవుతుంది. ఈ నిబంధన ఎన్నికలు జరిగేంత వరకు అమల్లో ఉండనుంది. ఈ విషయం తెలుసుకుని వెళ్తే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి